హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అండర్ 14 క్రికెట్ సెలక్షన్స్‌లో గందరగోళం నెలకొంది. జింఖానా గ్రౌండ్లో నిర్వహిస్తున్న సెలక్షన్స్‌కు దాదాపు 1000 మందికి పైగా ప్లేయర్లు తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు. అయితే ఏర్పాట్లు సరిగా చేయలేదంటూ ప్లేయర్ల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.