బంగ్లాదేశ్తో జరిగిన కాన్పూర్ టెస్టులో టీమిండియా దూకుడు మంత్రం ఫలించింది. వర్షం కారణంగా దాదాపు రెండున్నర రోజుల ఆట రద్దయిన నేపథ్యంలో ఫలితం రావాలంటే అద్భుత ప్రదర్శన తప్ప వేరే మార్గం లేకపోయింది. దీంతో టీమిండియా కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ దూకుడు ఆట ఆడాలని వ్యూహం వేశారు. అందుకు తగట్లుగా బ్యాటర్లందరూ టీ20 తరహా క్రికెట్ ఆడారు. దీంతో మిగతా రెండు రోజుల్లోనే ఈ టెస్టు ముగియగా భారత్ గెలిచింది.