భారత టెస్టు జట్టులో అశ్విన్, జడేజా, కుల్దీప్, అక్షర్ పటేల్ వంటి స్పిన్నర్లు రాణిస్తుండడంతో చాహల్‌కి ఈ ఫార్మాట్లో ఇప్పటివరకు అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. అయితే వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌తో జరగనున్న సిరీస్‌లో తనకు అవకాశం వస్తుందని.. అక్కడ మంచి ప్రదర్శన ఇస్తానన్నాడు చాహల్. ప్రస్తుతం తన ముందున్న లక్ష్యం అదేనని చెప్పాడు. ఇప్పుడు తాను ఆడుతున్న కౌంటీల్లో ప్రాక్టీస్ చేసుకునేందుకు మంచి అవకాశమని దొరికిందన్నాడు.