జమ్మూకశ్మీర్లో పోలింగ్ శాతంపై ఎన్సీపీ నేత ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై కేంద్రమంత్రి జేపీ నడ్డా స్పందించారు. గతంలో 6 శాతం నుంచి 8 శాతం పోలింగ్ నమోదైతే.. ఇప్పుడు 58 నుంచి 60 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ఒమర్ అబ్దుల్లాకు లెక్కలు రాకపోతే తానేం చేయగలనని చెప్పారు. తొలి దశలో 60 శాతం, రెండో దశలో 58 శాతం పోలింగ్ నమోదైనట్లు నడ్డా వెల్లడించారు.