TG: అనేక మంది ఉద్యమకారులను అవమానించిన చరిత్ర గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పీడ విరగడైందని ధ్వజమెత్తారు. గత పాలకులు గొప్ప గొప్ప స్పీచులు ఇవ్వొచ్చు, కానీ వారు చెప్పిన దానికి చేసిన దానికి పొంతన లేకుండా పరిపాలన చేశారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలంతా కలిసి ముందడుగు వేస్తే తప్పకుండా బంగారు తెలంగాణ అవుతుందన్నారు.