AP: ఆధ్యాత్మిక కేంద్రం రామనారాయణంలో వాల్మీకి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయటంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. మహోన్నత విలువలతో జీవించిన ధర్మ స్వరూపమే శ్రీరాముడు అని వెంకయ్యనాయుడు అన్నారు. మనిషిని మంచిదారిలో నడిపే వ్యక్తిత్వ వికాస గ్రంథమే రామాయణమని పేర్కొన్నారు. ధర్మమార్గంలో నడవడం వల్లే రాముడు ప్రజల గుండెల్లో నిలిచాడని వెల్లడించారు. నేటి యువతరం రాముడిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.