TG: మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటనను అడ్డుకోవాలని బీజేపీ నాయకురాలు మాధవీలత పిలుపునిచ్చారు. తిరుమల డిక్లరేషన్‌ను పట్టించుకోని జగన్ కొండకు ఎలా వస్తాడని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వంలో కల్తీ నూనెలను 18 సార్లు రిజెక్ట్ చేశారంటున్న నేతలు.. సీఎం చంద్రబాబు చేసిన విధంగా ఎందుకు ల్యాబ్‌కు పంపలేదని ప్రశ్నించారు. ఆర్జితం టిక్కెట్లనే వేలం చేసిన వైవీ సుబ్బారెడ్డి.. కల్తీలో భాగస్వామి కాకుండా ఎలా ఉంటారని అభిప్రాయపడ్డారు.