AP: నెయ్యి అనేది 3 టెస్టులు క్వాలిఫై అయితేనే ఆ ట్యాంకర్లను లోపలికి అనుమతిస్తారని మాజీ సీఎం జగన్ తెలిపారు. చంద్రబాబు కల్తీ జరిగిందని చెప్పిన నెయ్యి ట్యాంకర్లు వారు అధికారంలోకి వచ్చినవే అని స్పష్టం చేశారు. జులైలో టెస్టు రిపోర్టులు వచ్చాయని.. వాటిని వెనక్కి పంపించామని అప్పటి ఈవో చెప్పిన మాటలను జగన్ గుర్తు చేశారు. మరి 2 నెలల తర్వాత ఆ నెయ్యి వాడినట్లు చంద్రబాబు ఎందుకు చెప్పారని ధ్వజమెత్తారు.