అగ్రదేశాల జోక్యంతో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గింది. లెబనాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు చెలరేగిన నేపథ్యంలో భవిష్యత్లో ఆ దేశంతో కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చిస్తామని నెతన్యాహు వెల్లడించారు. కాగా, అమెరికా, ఫ్రాన్స్ చేసిన కాల్పుల విరమణ ప్రతిపాదనలను నెతన్యాహు గురువారం తిరస్కరించారు. దీంతో ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో నెతన్యాహు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.