AP: రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు గడువు విధించారు. దసరా పండుగలోపు అర్హులందరికీ రుణమాఫీ చేయాలన్నారు. బీఆర్ఎస్ రైతుల పక్షాన ఉండి కొట్లాడుతుందని తెలిపారు. ఒకవేళ రుణమాఫీ చేయకపోతే రాష్ట్రంలోని రైతులతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామని హరీష్ రావు హెచ్చరించారు. ఖరీష్ సీజన్ వచ్చినా ఇంతవరకూ రైతుబంధు పడలేదని.. అసలు రైతుబంధు ఇస్తారో? లేదో? చెప్పాలని డిమాండ్ చేశారు.