కర్ణాటక ప్రభుత్వానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ, కర్నాటక మధ్య కీలక ఒప్పందం జరిగింది. కర్ణాటక రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖల మంత్రి ఈశ్వర్ బి. ఖండ్రేతో పవన్ భేటీ అయ్యారు. ఏపీలో ఏనుగుల దాడులను హరికట్టేందుకు కర్ణాటక కుంకీ ఏనుగుల సాయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ టెక్నాలజీ ఏపీకి ఇవ్వడానికి కర్ణాటక ప్రభుత్వం అంగీకరించిందని పవన్ అన్నారు.