బీజేపీ అధికారంలోకి వస్తే.. ఇప్పుడు రైతులకు ఇస్తున్న రూ.6 వేల మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతామని కేంద్రమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ కింద రూ.5 లక్షల వరకు ఉన్న ఉచిత వైద్యం సదుపాయాన్ని రూ.10 లక్షలకు పెంచుతామన్నారు. వయోవృద్ధుల చికిత్సకు అదనంగా మరో రూ.10 లక్షల వరకు ఖర్చు చేసేందుకు వెసులుబాటు కల్పిస్తామని అన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అంబాలాలో మాట్లాడిన అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.