• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

Social Media War: ఇద్దరు IAS, IPS అధికారుల మధ్య ఫొటోల లొల్లి

కర్ణాటకలో ఇద్దరు సివిల్ సర్వీసెస్ అధికారుల మధ్య లొల్లి అక్కడి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. IAS అధికారిణి రోహిణి సింధూరి వ్యక్తిగత ఫోటోలను.. IPS అధికారిణి డీ రూప మౌద్గిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అసలు లొల్లి మొదలైంది. వీరి గొడవ ఎంటో తెలుసుకోవాలంటే కింది వార్తను చదివాల్సిందే.

February 20, 2023 / 05:57 PM IST

school holidays in telangana:ఏప్రిల్ 23 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు

school holidays in telangana:తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం చలి ఉన్నా.. ఉక్కపోత ఎక్కువే ఉంది. పిల్లలకు ఒంటి పూట బడులపై విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మార్చి 15వ తేదీ నుంచి హాఫ్ డే స్కూల్ ఉంటుందని ప్రకటన చేశారు. ఏప్రిల్ 23 నుంచి స్కూళ్లకు సెలవులను ప్రకటించారు.

February 20, 2023 / 07:03 PM IST

30 Years Prudhvi : లక్ష్మీ పార్వతి కామెంట్స్ పై 30ఇయర్స్ పృథ్వీ రియాక్షన్

30 Years Prudhvi : సినీ నటుడు తారకరత్న తుదిశ్వాస విడిచారు. లోకేష్ పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన ఆయన గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. 23 రోజులు వెంటిలేటర్ పై చికిత్స పొందిన ఆయన శనివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన మృతి పై అందరూ విచారం వ్యక్తం చేశారు.

February 20, 2023 / 04:53 PM IST

Viral Video: అమ్మాయిలతో కలిసి డాన్స్ చేసిన ప్రొఫెసర్లు

కాలేజ్ అమ్మాయిలు డాన్స్ చేస్తుంటే మధ్యలో మహిళా ప్రొఫెసర్లు కూడా వచ్చి జాయిన్ అయితే ఎలా ఉంటుంది. క్రేజీ కాదా. అవును. ఈ వీడియోలో అదే జరిగింది. ఢిల్లీలోని జీసెస్ & మేరీ కాలేజ్ విద్యార్థినులు ఫ్లాష్ మాబ్ చేస్తున్న క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

February 20, 2023 / 04:52 PM IST

Viral News : పులిని వండుకొని తిన్నారు..!

Viral News : పులిని వేటాడం గురించి విని ఉంటారు. కానీ... పులిని చంపి.. దానిని వండుకొని తినడం గురించి ఎప్పుడైనా విన్నారా..? అసలు ఎవరైనా తింటారా అని ఆశ్చర్యపోకండి. నిజంగానే తిన్నారు. ప్రకాశం జిల్లా అక్కపాలెంలో ఈ సంఘటన చోటుచేసుకోగా.... ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

February 20, 2023 / 04:09 PM IST

Accident: లోయలో పడ్డ పెళ్లి బస్సు..15 మంది స్పాట్ డెడ్, 60 మందికి గాయాలు

పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఓ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, మరో 60 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది.

February 20, 2023 / 04:23 PM IST

Bandi Sanjay: కేసీఆర్ కేంద్రానికి రాసిన లేఖపై చర్చకు సిద్ధమా..బీఆర్ఎస్ ఇంకా మూడు నెలలే!

తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెడతాం లోన్ కావాలని తెలంగాణ ప్రభుత్వమే కేంద్రానికి లేఖ రాసిందన్నారు. ఈ అంశంపై చర్చకు సిద్ధమా అంటూ కేసీఆర్ ను బండి సంజయ్ ప్రశ్నించారు. ఇప్పుడేమో కేంద్ర ప్రభుత్వం మీటర్లు పెడతానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిలదీశారు. మరోవైపు సింగరేణిలో రాష్ట్రానికి 51 శాతం వాటా ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఎలా ప్రైవేటు పరం చేస్తుందని నిలదీశారు.

February 20, 2023 / 07:08 PM IST

Crime : తనతో పెళ్లికి ఒప్పుకోలేదని..కత్తిమెడపై పెట్టి.. జట్టు లాగి….!

Crime : తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ 47ఏళ్ల వ్యక్తి 16 ఏళ్ల మైనర్ బాలికను బెదిరించాడు. ఆమె అంగీకరించలేదని.. మెడపై కత్తి పెట్టి... జుట్టుపట్టుకొని లాక్కెళ్లాడు. ఈ అమానుష ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌ లో చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని ఆదివారం అరెస్టు చేశారు.

February 20, 2023 / 03:03 PM IST

Harish Rao : త్వరలో 1400 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ : మంత్రి హరీష్‌రావు

రాష్ట్ర ప్రజల ఆరోగ్య ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆరోగ్య శాఖమంత్రి హరీష్‌రావు(Harish Rao) చెప్పారు. ఇవాళ హైదరాబాద్‌ (hyderabad)లోని పేట్ల బురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో జరిగిన 'ఇన్‌ఫెక్షన్‌ ప్రివెన్షన్‌, ఎర్లీ డిటెక్షన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌'లో ఆయన మాట్లాడారు.

February 20, 2023 / 02:43 PM IST

Uddhav Thackeray: శివసేనపై సుప్రీం కోర్టులో థాక్రేకు షాక్

శివసేన పార్టీ(shiv Sena), గుర్తు (symbol) విషయమై ఉద్ధవ్ థాక్రే (Uddhav Thackeray) గ్రూపు భారత అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టును (supreme court) ఆశ్రయించింది. అయితే అక్కడ కూడా షాక్ తగిలింది. శివసేన, ఎన్నికల గుర్తు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే వర్గానికే చెందుతుందని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం స్పష్టం చేసింది. దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఉద్ధవ్‌ థాక్రే. అయితే ఈ కేసు ఆర్...

February 20, 2023 / 02:37 PM IST

Meghalaya bjp chief:గొడ్డు మాంసం తింటా: మేఘాలయా బీజేపీ చీఫ్ కాంట్రవర్సీ కామెంట్స్

Meghalaya bjp chief controversy comments:మేఘాలయా బీజేపీ చీఫ్ ఎర్నెస్ట్ మావ్రీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తను గొడ్డు మాంసం తింటానని పేర్కొన్నారు. బీఫ్ తినడంపై తమ పార్టీలో నిషేధం ఏమీ లేదని అగ్నికి ఆజ్యం పోశారు. కులం, మతం, వర్గం అని బీజేపీ చూడదని అన్నారు. తాను బీఫ్ తినడం వల్ల బీజేపీకి ఎలాంటి సమస్య లేదని చెప్పారు.

February 20, 2023 / 07:13 PM IST

Madhya Pradesh : మద్యం అమ్మకాలపై మధ్యప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం

మద్యం అమ్మకాల విషయంలో మధ్యప్రదేశ్( Madhya Pradesh) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో రాష్ట్రంలో బార్లను మూసేయనున్నట్లు తెలిపింది. వైన్స్ షాపు ( Whines shop) లో మద్యం అమ్మకాలు మాత్రమే జరుగుతాయని అక్కడ కుర్చుని తాగేందుకు అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు.

February 20, 2023 / 01:39 PM IST

balloon landed in farmers field:పొలాల్లో పడిన పెద్ద బెలూన్.. రైతుల టెన్షన్, ఏం జరిగిందంటే?

balloon landed in farmers field:నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో కూడా పెద్ద బెలూన్ కలకలం రేపింది. వ్యవసాయ పొలాల పక్కనే గల మామిడి తోటలో పడింది. దీంతో అక్కడ ఉన్న రైతులు, రైతు కూలీలు భయాందోళనకు గురయ్యారు.

February 20, 2023 / 07:15 PM IST

Amitabh : అమితాబచ్చన్ బంధువుకి కుచ్చు టోపీ…!

Amitabh : బిగ్ బీ అమితాబచ్చన్ బంధువుకి ఓ వ్యక్తి కుచ్చుటోపీ పెట్టాడు. కాగా... ఈ కేసులో సంధ్య కన్వెన్షన్ ఎండీ సంధ్య శ్రీధర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసులు.. హైదరాబాద్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

February 20, 2023 / 01:24 PM IST

Yadadri Brahmotsavams రేపటి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. సీఎం కేసీఆర్ రాక

ఆలయ పున:నిర్మాణం తర్వాత జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు ఆలయ పాలక మండలి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. పెద్ద ఎత్తున భక్తులు తరలి రానుండడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం వారాంతాల్లో భక్తులు భారీగా వస్తున్నారు. ఇక ఉత్సవాలకు ఆలయం కిటకిటలాడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తులకు సరిపడా ఏర్పాట్లు ఉండేందుకు పాలక మండలి అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టింది.

February 20, 2023 / 01:02 PM IST