కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగి పట్ల కానిస్టేబుల్ సత్యనారాయణ దురుసుగా ప్రవర్తించాడు. తలకు కట్టు కట్టుకొని ఉన్న రోగిని లాఠీతో కొట్టాడు. ఆ ఘటనను వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది తొలిసారిగా ఈ అవార్డును అందజేసింది. ఈ అవార్డు వేడుక ఆదివారం బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో జరగనుంది. అయితే రతన్ టాటా ఈ రోజు అంటే శనివారం తన నివాసంలో అవార్డుతో సత్కరించారు. ఈ సన్మానం సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తదితరులు పాల్గొన్నారు.
బైజూస్‌లో మెంటరింగ్ (టీచింగ్ స్టాఫ్), ప్రొడక్ట్ ఎక్స్‌పర్ట్ విభాగంలో ఈ రిట్రెంచ్‌మెంట్ జరిగింది. కంపెనీ ఈ ఉద్యోగులను జూలైలో పనితీరు సమీక్షలో ఉంచింది. దీని తరువాత ఆగస్టు 17 న ఈ ఉద్యోగులందరినీ రాజీనామాలు సమర్పించాలని కంపెనీ కోరింది.
భారత్‌కు చెందిన వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీపడేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పటికే ఆయన ఆ పార్టీ అభ్యర్ధిత్వం కోసం ప్రచారం కూడా మొదలుపెట్టారు.
ఈ వీడియోలో సన్నీ సెల్ఫీ తీసుకుంటున్న అభిమాని పై ఆగ్రహించడం కనిపిస్తోంది. ఈ వీడియో అంతకంతకూ వైరల్ అవుతోంది. ఇప్పుడు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా దీనిపై స్పందించింది. సన్నీ డియోల్‌కు మద్దతుగా నటి ట్వీట్ చేసింది.
తన తల్లి కారు వెనుక మూత్ర విసర్జన చేసినందుకు బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మొత్తం ఘటనతో చిన్నారి భయాందోళనకు గురవుతున్నట్లు చిన్నారి తల్లి తెలిపారు.
ఆర్బీఐ బ్యాంకులకు షాక్ ఇచ్చింది. వడ్డీల రూపంలో అధిక పెనాల్టీలు విధించే బ్యాంకులకు జరిమానా విధిస్తామని తెలిపింది. అలాగే వచ్చే ఏడాది జనవరి 1వ తేది నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తాయని ప్రకటించింది.
కేసీఆర్ సర్కార్ మైనార్టీలకు కూడా రూ.లక్ష అందజేస్తోంది. మరీ ఓసీలు, కొందరు బీసీలు, దళితులకు అన్యాయం జరుగుతుంది. దళితులకు దళితబంధు ఉన్నప్పటికీ.. అదీ కొందరికే వస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు అయితే నెలలో ఒకటో తేదీన జీతం అనే మాట ఎప్పుడో మరచిపోయారు.