TG: గ్రేటర్ హైదరాబాద్లో వాయు కాలుష్యం రికార్డు స్థాయిలో నమోదైంది. గతేడాది దీపావళితో పోలిస్తే కాలుష్యం ఈ సారి 15 నుంచి 20 రెట్లు అధికంగా నమోదైనట్లు తెలుస్తోంది. గాలిలో ప్రమాదకర స్థాయిలో దుమ్ము, ధూళి కణాలు ఉన్నట్లు గుర్తించారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 171గా నమోదైంది. నైట్రోజన్ ఆక్సైడ్, సల్పర్ డయాక్సైడ్ కారణాలు గాలిలో పెరిగినట్లు సమాచారం.