మునగాకు కషాయంతో అనేక లాభాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఫ్రెష్ ఆకులను ఒక గిన్నెలో తీసుకుని నీళ్లు పోసి మరిగించాలి. అవి మెత్తబడ్డాక వడకట్టి తాగాలి. మునగాకులను ఎండబెట్టి, పొడి చేసుకొని కషాయం చేసుకోవచ్చు. నిత్యం పరగడుపున ఒక గ్లాసు ఈ నీటిని తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. షుగర్, BP, కొవ్వు, జీర్ణ సమస్యలను నియంత్రిస్తుంది. రక్తహీనత తగ్గుతుంది, ఎముకలు బలపడతాయి.