చాలా మంది పంచదారకు బదులుగా బెల్లం వినియోగిస్తుంటారు. అయితే కొందరు బెల్లాన్ని వినియోగించిన అనంతరం రిఫ్రిజిరేటర్లో నిల్వ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల బెల్లం జిగటగా మారి, బూజు పట్టే అవకాశం ఉంటుంది. అందుకే బెల్లాన్ని తేమ తగలకుండా, గాలి చొరబడని కంటైనర్లో నిల్వ చేయడం శ్రేయస్కరం.