చికెన్, మటన్ వంటి మసాలా కూరల్లో కొందరు నిమ్మరసం పిండుకుంటారు. ఇలా చేయడం వల్ల రుచితోపాటు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసంలోని విటమిన్ C హానికర బ్యాక్టీరియాను నాశనం చేస్తుందంటున్నారు. మాంసం తిన్నతర్వాత జీర్ణక్రియ మందగిస్తుంది. అయితే నిమ్మరసం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని అంటున్నారు. కానీ మోతాదుకు మించి వాడితే ఎసిడిటీ వస్తుందని హెచ్చరిస్తున్నారు.