TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలుపు రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనకు రెఫరెండం అని కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి అన్నారు. ఇది బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటమి కాదని.. కేసీఆర్, కేటీఆర్ ఓటమి అని విమర్శించారు. సోషల్ మీడియాతో ప్రజలను కేటీఆర్ మభ్యపెట్టలేరని మండిపడ్డారు. ఈ ఓటమి కేటీఆర్ పొగరు, అహంకారానికి నిదర్శనమన్నారు.