AP: గత ప్రభుత్వ హాయాంలో పోలీసులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని కోరుతూ AR కానిస్టేబుల్ ప్రకాష్ నిరసన తెలపడంతో డిస్మిస్ అయ్యారు. అయితే డిమాండ్లను అడిగినందువల్లే డిస్మిస్ చేశారని భావించిన కూటమి ప్రభుత్వం ఆయనను తిరిగి విధుల్లో చేరడానికి వీలుగా ఆదేశాలు జారీ చేసింది. డిస్మిస్ అయిన కాలాన్ని విధుల్లో లేనట్లు పరిగణించి, తిరిగి చేరడానికి అవకాశం కల్పించింది.