TG: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి PCC చీఫ్ మహేష్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కిషన్ రెడ్డికి లేదని పేర్కొన్నారు. కేంద్రమంత్రిగా రాష్ట్రానికి ఏం తెచ్చారని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BJPకి డిపాజిట్ రాకుండా చేశారని ఎద్దేవా చేశారు. ఆర్థిక ఇబ్బందులున్నా 80 శాతం హామీలను అమలు చేశామని తెలిపారు. మూడేళ్లలో అన్ని హామీలు అమలు చేస్తామి చెప్పారు.