TG: కొడకండ్లలో రైతు ఇంటి గేటు తీసుకెళ్లడాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా తప్పుబట్టారు. వేల కోట్లు అప్పు తీసుకున్న వారిని ఏం చేస్తున్నారని.. బ్యాంకులు వారి దగ్గర నుంచి ఎందుకు రికవరీ చేయడం లేదని? ప్రశ్నించారు. బ్యాంకింగ్ రంగం వ్యవసాయంపై దృష్టి పెట్టాలని.. రైతులను గౌరవించాలని సూచించారు. రైతులంటే అడుక్కునే వారు, బ్యాంకులంటే ఇచ్చే వారు అనే భావన వద్దని చెప్పారు.