AP: లారీ ఓనర్ల అసోసియేషన్ నిర్వహించ తలపెట్టిన బంద్ తాత్కాలికంగా వాయిదా పడింది. బంద్‌కు సంబంధించిన డిమాండ్లపై ప్రభుత్వం, లారీ ఓనర్ల అసోసియేషన్ నేతలతో చర్చలు జరిపింది. దీంతో బంద్‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు లారీ ఓనర్స్ అసోసియేషన్ వెల్లడించింది. కాగా, ఫిట్నెస్ ఛార్జీలు తగ్గించాలని లారీ ఓనర్ల సంఘం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.