AP: మంత్రి నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. వర్షాలకు దెబ్బతిన్న ఫీడర్ కెనాల్, టన్నెల్ పరిశీలించారు. ఈ క్రమంలో అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారినా అధికారుల తీరు మారలేదని మండిపడ్డారు. పనులలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.