AP: భద్రాద్రి జిల్లాలో వింత నిరసన వెలుగు చూసింది. నిమ్మలగూడెంకు చెందిన 4వ తరగతి విద్యార్థి వారం నుంచి స్కూల్‌కి రాకపోవడంతో టీచర్స్ తల్లిదండ్రులను ప్రశ్నించారు. వారు సరిగా సమాధానం ఇవ్వకపోవడంతో టీచర్స్, తోటి విద్యార్థులు బాలుడి ఇంటి ముందు బైఠాయించారు. దీంతో పేరెంట్స్ సోమవారం నుంచి తమ బాబుని బడికి పంపిస్తామన్నారు. మీ ఫ్రెండ్ బడికి రాకపోతే మీరేం చేశారు?