AP: నెల్లూరులో గంజాయి వ్యాపారం చేస్తూ లేడీ డాన్‌గా దాడులు చేస్తున్న అరవ కామాక్షి ఇంటిని స్థానికులు నేలమట్టం చేశారు. అలాగే ఆమె అనుచరుల ఇళ్లను సైతం నేలమట్టం చేసినట్లు సమాచారం. ఇటీవల స్థానిక కమ్యూనిస్టు నేత పెంచలయ్యను తన మనుషులతో అతి దారుణంగా హత్య చేయించింది. దీంతో కామాక్షితో పాటు హత్యకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.