AP: కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై జనసేన కార్యాలయం స్పందించింది. ‘రాజోలులో రైతులతో సరదాగా ముచ్చటిస్తూ చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉంది. దయచేసి పవన్ వ్యాఖ్యలు వక్రీకరించవద్దు’ అని కోరింది.