బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన వేళ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఈ ఎన్నికల్లో మా కూటమి విజయం సాధిస్తుంది. మార్పు రానుంది. మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు. కాగా, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో తేజస్వీ యాదవ్ ముందజలో ఉన్నారు.