TG: హైదరాబాద్ ఐకానిక్ నగరంగా నిలిచిందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. ప్రపంచస్థాయి కంపెనీలకు HYD ఇప్పుడు గమ్యస్థానంగా ఉందన్నారు. నీతి ఆయోగ్ లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047 ఉందన్నారు. గత పదేళ్లుగా తెలంగాణ గొప్ప అభివృద్ధిని సాధిస్తోందని తెలిపారు. దేశంలోనే వృద్ధిరేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని కొనియాడారు.