భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ నుంచి దిగుమతయ్యే బియ్యంపై అదనపు సుంకాలను విధించాలనే ఆలోచనలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. చౌకైన విదేశీ వస్తువుల దిగుమతి ప్రభావం అమెరికా ఉత్పత్తిదారులపై పడుతుందని అక్కడి రైతులు ఫిర్యాదు ఇచ్చారట. దీంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.