AP: మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా లోకేష్ టూర్ కొనసాగుతోంది. శాన్ ఫ్రాన్సిస్కోలో సెలెక్టా వీసీ, మేనేజింగ్ పార్టనర్ అరుణ్ కుమార్, కాన్వా చీఫ్ కస్టమర్స్ సక్సెస్ ఆఫీసర్ రోబ్ గిగిలియో, ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ సెక్టార్ విభాగాధిపతి జాసన్ విల్ మాట్లతో లోకేష్ భేటీ అయ్యారు.