బీహార్ ఎన్నికల్లో NDA కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఇది ‘వికసిత్ బీహార్’ (అభివృద్ధి చెందిన బీహార్)పై విశ్వాసం పెట్టుకున్న ప్రతి ఒక్కరి విజయమని ఆయన అభివర్ణించారు. ‘జంగల్‌రాజ్, బుజ్జగింపు రాజకీయాలు చేసేవారు ఏ రూపంలో వచ్చినా, వారికి బీహార్‌ను దోచుకునే అవకాశం లభించదని షా గట్టిగా వ్యాఖ్యానించారు.