TG: ఎల్లుండి తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఈ సాయంత్రం 5 గంటల నుంచి వైన్స్, బార్లు, రెస్టారెంట్లు బంద్ కానున్నాయి. తిరిగి 11వ తేదీ ఓపెన్ చేస్తారు. అయితే ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోనే ఈ ఆంక్షలు ఉంటాయి. ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ అధికారులు హెచ్చరించారు.