AP: ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు భారత్ వైపు చూసే పరిస్థితి వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. ‘పేదరికం, అసమానతలు రూపుమాపేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాం. గ్రీన్ ఎనర్జీ వినియోగం, స్వచ్ఛాంధ్ర దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా ఐటీలో మనవాళ్లే ముందున్నారు. ఏపీకి స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ, క్వాంటమ్ వ్యాలీ వస్తున్నాయి’ అని వెల్లడించారు.