కొన్ని చిట్కాలతో చర్మంపై జిడ్డును తొలగించుకోవచ్చు. బాదం పొడిలో తేనె కలిపి ఆ మిశ్రమాన్ని స్క్రబ్‌లా వాడటం వల్ల చర్మంపై జిడ్డు తొలగిపోతుంది. గుడ్డు తెల్లసొనలో ఒక చెంచా తేనె, శనగపిండి కలిపి ముఖానికి రాసుకుని 15-20 నిమిషాల తర్వాత కడిగితే మంచి ఫలితం ఉంటుంది. రెండు చెంచాల ఓట్స్ పొడిలో కలబంద గుజ్జు కలిపి కాసేపు ముఖంపై మర్దన చేస్తే జిడ్డు తొలగిపోతుంది.