చైనాలో మన దేశ ఔషధ కంపెనీలు విస్తరిస్తున్నాయి. చైనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మందుల సమీకరణ కాంట్రాక్టుల్లో డాక్టర్ రెడ్డీస్, సిప్లా, నాట్కో ఫార్మా, హెటిరో ల్యాబ్స్, అన్నోరా ఫార్మా సంస్థలు చైనా ఆసుపత్రులకు మందులు సరఫరా చేసే కాంట్రాక్టులు గెలుచుకున్నాయి. డపాగ్లిఫ్లోజిన్ ట్యాబ్లెట్ల సరఫరా కాంట్రాక్టు సంపాదించిన ఏడు ఫార్మా కంపెనీల్లో హెటిరో ల్యాబ్స్, సిప్లా ఉన్నాయి.