బీహార్ ప్రజలు అన్ని రికార్డులూ బద్దలు కొట్టారని PM మోదీ కొనియాడారు. తాము ప్రజలకు సేవకులమని, వారి మనసులు గెలుచుకున్నామని తెలిపారు. ప్రజలు ‘వికసిత్ బీహార్’ కోసం ఓటేశారని, ఇకపై ‘జంగల్ రాజ్’ ఎప్పటికీ తిరిగి రాదన్నారు. తాము మహిళ, యూత్(MY) ఫార్ములాతో ప్రచారానికి వచ్చామన్నారు. సీఎం నితీశ్ కుమార్ నాయకత్వాన్ని ప్రశంసించారు. ఈ విజయంతో ఈసీపై ప్రజలకు నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు.