మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వచ్చి 10 రోజుల అవుతున్నా.. CM పదవిపై ఉత్కంఠ వీడటం లేదు. సీఎం ఎవరనేది తేల్చలేకపోయారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా రంగంలోకి దిగినా ఫలితం లేదు. సీఎం అభ్యర్థిని తేల్చకపోవడంతో ఏక్నాథ్ షిండే తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. శివసేన పార్టీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడితే.. పదవులకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.