AP: సీఎం చంద్రబాబుపై మాజీమంత్రి కన్నబాబు విమర్శలు గుప్పించారు. మనం బాగుండాలనే స్వలాభమే కనిపిస్తుంది తప్ప.. ప్రజల బాగు కోసం ఆలోచించడం లేదని మండిపడ్డారు. ‘చంద్రబాబుది ఎప్పుడు డబుల్ యాక్షనే. ఎన్నికలకు ముందు ఒక యాక్షన్.. ఎన్నికలు అయ్యాక మరో యాక్షన్. అప్పులు.. అబద్ధాలు తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు. బాబు ఒక్కరోజు చేసే అప్పుతో ఒక మెడికల్ కళాశాల పూర్తవుతుంది’ అని పేర్కొన్నారు.