TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్ 10 రౌండ్లలో పూర్తి కానుంది. 101 పోస్టల్ ఓట్లు నమోదయ్యాయి. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లకు గానూ.. 1,94,631 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. తొలుత షేక్‌పేట డివిజన్ ఓట్ల కౌంటింగ్ ప్రారంభం కానుంది. 3, 4 గంటల్లో భవితవ్యం తేలనుంది. కౌంటింగ్ విధుల్లో 186 మంది సిబ్బంది ఉన్నారు. 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు.