AP: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి 15 ఏళ్లు దాటిన ట్రక్కులు నిలిపివేయాలని లారీ ఓనర్ల సంఘం నిర్ణయం తీసుకుంది. అన్ని గూడ్స్ షెడ్లు, షిప్ యార్డుల నుంచి ట్రక్కులు నిలిపివేయనున్నారు. దీంతో విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం, గంగవరం పోర్టుల నుంచి సరకు రవాణా నిలిచిపోనుంది. కాగా ప్రభుత్వం ఫిట్నెస్ ఛార్జీలు తగ్గించాలని లారీ ఓనర్లు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.