గోవా రెస్టారెంట్ అగ్నిప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో 23 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అటు ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ గోవా సీఎం సావంత్‌తో ఫోన్లో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.