TG: క్రీడాకారుల విజయానికి అనేక అంశాలు దోహదం చేస్తాయని బ్యాడ్మింటన్ ప్లేయర్ PV సింధు అన్నారు. ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ అంశంపై చర్చల్లో మంత్రి అజారుద్దీన్, కుంబ్లే, గుత్తా జ్వాల, రాయుడుతోపాటు పాల్గొన్న ఆమె.. ఆటగాళ్లకు మౌలిక వసతులు, కోచ్ చాలా కీలకమని తెలిపారు. రాష్ట్రం నుంచి ఎందరో ప్లేయర్లు ఆంతర్జాతీయ స్థాయికి వెళ్లారని, ఆటగాళ్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మంత్రి తెలిపారు.