AP: టీటీడీ ఏవీఎస్వో సతీష్ మృతిపై జనసేన నేత కిరణ్ రాయల్ స్పందించారు. పరకామణి నిందితుడు రవికుమార్కి ప్రాణహాని ఉందని తెలిపారు. రవికుమార్‌ను కస్టడీలోకి తీసుకోవాలని కోరారు. సతీష్ మృతదేహం రైలుపట్టాల దగ్గర లభించిందని.. అతని ముఖంపై గాయాలున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. డీజీపీ తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.