TG: జూబ్లీహిల్స్ గెలుపులో అండగా నిలబడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తమ రెండేళ్ల పాలనకు ఈ గెలుపు.. ప్రజల ఆశీర్వాదంగా తీసుకుంటామని అన్నారు. జూబ్లీహిల్స్ గెలుపు తమ బాధ్యతను పెంచిందన్నారు. గెలుపుతో తాము పొంగిపోము.. ఓటమితో కుంగిపోమని అన్నారు. అందుకే శతాబ్దికాలంగా కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధిస్తుందన్నారు.