AP: కక్షసాధింపు చర్యల్లో భాగంగానే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం కల్పిత ఆధారాలు సృష్టిస్తుందని, లిక్కర్ స్కామ్ అనేది చంద్రబాబు హయాంలోనే జరిగిందన్నారు. 40 వేలకుపైగా బెల్ట్ షాపులు పెట్టి మద్యం ఏరులై పారించారని, టీడీపీ నేతలే సిండికేట్గా ఏర్పడి మద్యం షాపులు నడుపుతున్నారని ఆరోపించారు.