AP: పెట్టుబడులపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు. 2019లో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన కంపెనీ.. రేపు మళ్లీ తిరిగి వస్తుందని తెలిపారు. ఈ కంపెనీ తుఫానులా ఏపీకి తిరిగి వస్తోందన్నారు. పూర్తి వివరాల కోసం ఉదయం 9 గంటల వరకు వేచి ఉండాలని ఎక్స్‌లో పోస్టు చేశారు. కాగా అది అమర రాజా కంపెనీ అయి ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.