కర్ణాటక రాజకీయం డీకే శివకుమార్ నివాసం చుట్టూ తిరుగుతోంది. సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డీకే ఇంటికి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో నాయకత్వ మార్పుపై ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. ఈ భేటీ జరుగుతుండటంతో అందరి దృష్టి అటువైపే ఉంది. అసలు ఈ ఇద్దరి మధ్య ఏం చర్చ జరుగుతోందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.