TG: విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోందని మాజీమంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. రైతుల మోటార్లకు మీటర్లు తీసుకొచ్చే కుట్రలు చేస్తోందని.. మూడో డిస్కం తీసుకురావడం వెనుక అసలు ఉద్దేశం ఇదేనని తెలిపారు. విద్యుత్ వినియోగదారులను చీకట్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. కరెంట్ మీటర్లకు స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని వ్యాఖ్యానించారు.