తమిళనాడు మాజీ సీఎం దివంగత కరుణానిధి పెద్ద కుమారుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ సోదరుడు ఎంకే ముత్తు కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. 1970లో తమిళ చిత్రసీమకు నటుడిగా పరిచయమైన ఆయన.. పిళ్లైయో పిళ్లై, సమైయల్కారన్, అణైయావిళక్కు, ఇంగేయుం మనిదర్గళ్ తదితర సినిమాల్లో నటించారు.